
సోలార్ విద్యుత్ తీగ తగిలి రైతు..
నేరడిగొండ: పంట రక్షణకు అమర్చిన సోలార్ ఫెన్సింగ్ తీగకు తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని తేజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపిన వివరాల ప్ర కారం.. ఏలేటి నారాయణరెడ్డి (59) కోతుల బెడద నుంచి పంట రక్షణకు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం ఉదయం కోతులు వచ్చాయని తెలియగా వాటిని తరమడానికి చేనుకు వెళ్లాడు. ఈ క్రమంలో సోలార్ ఫెన్సింగ్ తీగకు తగిలి కింద పడ్డాడు. పక్కనే వ్యవసాయ క్షేత్రంలో ఉన్న రైతులు గమనించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రైవేట్ వాహనంలో బోథ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతడు మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు నవనీత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.