
ప్రమాదంలో గాయపడి వృద్ధురాలు..
జైపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికి త్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై శ్రీధర్ తెలి పారు. ఆయన కథనం ప్రకా రం.. మండలంలోని ఎల్కంటి గ్రామానికి చెందిన యువకుడు తుంగపిండి శివరాం గత నెల 24న రాత్రి తన బైక్‌తో అదే గ్రామానికి చెందిన జనగామ లింగమ్మ(70) ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ లింగమ్మను మంచిర్యాలలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు అక్కడికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజాము మృతి చెందింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.