
నీటమునిగిన పంటలు
కోటపల్లి/చెన్నూర్‌రూరల్: ఇటీవల కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోటపల్లి మండలం రాంపూర్, కొల్లూర్, దేవులవాడ, లక్ష్మిపూర్ శివారులో గోదావరి వరదతో పత్తి, మిర్చి, వరి పంటలు పూర్తి నీటమునిగాయి. ఎగువన కురిసిన వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చెన్నూర్ మండలం సుందరసాల గ్రామ సమీపంలోని అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో పత్తి పంటలు నీట మునిగాయి. ఈ ఏడాదిలో పంటలు మునిగిపోవడం రెండోసారి కాగా.. అధికారులు కనీసం సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం ఆదుకోవాలని కోరుతున్నారు.