
రేషన్ డీలర్ల నిరసన
మంచిర్యాలఅగ్రికల్చర్: గత ఆరు నెలల రేషన్ కమీషన్ వెంటనే విడుదల చేయాలని రేషన్ డీలర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఆరు నెలలుగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నా కమీషన్ చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. దసరా, దీపావళి పండుగలకు పస్తులు ఉండే దుస్థితి నెలకొందని తెలిపారు. కేంద్రం కమీషన్ విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం పెడింగ్‌లో ఉంచుతోందని పేర్కొన్నారు. పెండింగ్ కమీషన్‌తోపాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రూ.5000 వేల గౌరవ వేతనం, క్వింటాల్‌కు రూ.300 కమీషన్ చెల్లించాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సత్తయ్య, సత్యనారాయణరెడ్డి, ఎస్.కృష్ణ, మహేందర్, రవికుమార్, ప్రఽశాంత్, సునిల్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి
వ్యాసరచన పోటీలు
దండేపల్లి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో 11 మంది తెలంగా ణ కవులపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కన్వీ నర్ గోపగాని రవీందర్ తెలిపారు. పా ఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతీ పాఠశాల నుంచి ఒక అబ్బా యి, అమ్మాయి రా సిన రెండు వ్యాసాలను జిల్లాస్థాయి పోటీలకు పంపించాలని, జిల్లాస్థాయిలో ప్రత్యక్ష పోటీకి ఎంపికై న 50 వ్యాసాల్లో 5 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతి అందజేస్తామని, అక్టోబర్ 6లోగా వ్యాసాలు పంపించాలని పేర్కొన్నారు.