
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం
నస్పూర్: ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన పట్టణ పరిధిలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్(టీఎన్జీఓ)కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో 317 బాధితులకు ఉపయోగపడేలా జీవో 190ను సాధించిన ఘనత టీజీఈజేసీదే అని అన్నారు. ఉద్యోగుల సమస్యల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో చర్చలు జరిపి పరిష్కరించుకుంటామన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటుతో హెచ్‌ఆర్‌ఏ పెంపొందించేందుకు కృషి చేయాలని స్థానిక నాయకులు ఆయన్ను కోరారు. కార్యక్రమంలో టీఎన్జీఓ మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సంద అశోక్, జిల్లా అధ్యక్షులు శ్రీహరి, మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు, జిల్లా కార్యదర్శి రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, నాయకులు సతీశ్‌కుమార్, రాణి, శ్రీనివాస్, రామ్‌కుమార్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన టీఎన్జీఓస్ కేంద్ర అధ్యక్షుడు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల టీఎన్జీఓస్ కాలనీలో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆదివారం మొక్కలు నాటా రు. ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ అశోక్, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, మాజీ అధ్యక్షుడు సురేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, కేంద్రం సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపు, జిల్లా, మంచిర్యాల యూనిట్ల టీఎన్జీఓస్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.