● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు | - | Sakshi
Sakshi News home page

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

Sep 27 2025 5:21 PM | Updated on Sep 27 2025 5:23 PM

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు ● పండుగ కోసం కార్యక్రమాలన్నీ వాయిదా ● తొమ్మిది రోజులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబరాలు

పండుగ కోసమే..

మంచిర్యాలటౌన్‌: చిన్ననాటి నుంచి బతుకమ్మ పండుగ వస్తే చాలు స్నే హితులతో కలిసి పూల ను సేకరించి, బతుక మ్మ పేర్చేవాళ్లం. పెళ్లయిన తరువాత కూడా బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి భర్తతో కలిసి హైదరాబాద్‌ నుంచి మంచిర్యాలకు వస్తున్నాను. మంచిర్యాలలో బతుకమ్మ పండుగను ఎప్పటికీ మిస్‌ కానివ్వను. – హర్షిణి

పనులు మానుకొని..

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఏటా బతుకమ్మ పండుగకు ఎన్ని పనులు ఉన్నా మానుకొని తప్పనిసరిగా హైదరాబాద్‌ నుంచి ఆసిఫాబాద్‌ సొంతింటికి వస్తాను. కాలనీవాసులతో కలిసి బతుకమ్మ ఆడుతాను. సద్దుల పండుగకు సుమారు రూ.5వేల ఖర్చుతో పూలను విక్రయించి బతుకమ్మ పేరుస్తాను.

– స్రవంతి

కెనడా నుంచి వచ్చాం..

మంచిర్యాలటౌన్‌: పెళ్లయిన తరువాత కెనడాలోనే ఉంటున్నాం. రెండున్నర సంవత్సరాల తర్వాత బాబుతో కలిసి పండుగ కోసం మంచిర్యాలకు వచ్చాను. అమ్మ వాళ్లది గద్దెరాగడి ప్రాంతం. అత్త వారిది మంచిర్యాల. ఇక్కడే పండుగ జరుపుకోవాలని కెనడా నుంచి వచ్చాం.

– సౌమ్య

ప్రతీ ఏడాది వస్తా..

మంచిర్యాలటౌన్‌: బతుకమ్మ పండుగ అంటే మాకు ఎంతో ప్రత్యేకం. అందుకే ఏటా పండుగ కోసం హైదరాబాద్‌ నుంచి మంచిర్యాలకు వస్తాను. లక్ష్మీనగర్‌లో అందరితో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతాం.

– సుమ

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో

బతుకమ్మ ఆడుతున్న మహిళలు

ముంబై నుంచి..

ఖానాపూర్‌: నా భర్త ముంబైలో ఏసీ మెకానిక్‌ పని చేస్తాడు. మేం అక్కడే ఉంటాం. ప్రతీ సంవత్సరం దసరా, బతుకమ్మ ఉత్సవాలకు పిల్లలతో కలిసి ఖానాపూర్‌కు వస్తాం. ఈ ఏడాది భవాని దీక్ష తీసుకున్నాను. పండుగలు ముగిసే వరకు ఇక్కడే ఉంటాం.

– మర్రి లక్ష్మి

తల్లిగారింటికే..

ఖానాపూర్‌: మాది ఖా నాపూర్‌ మండలం సుర్జాపూర్‌ గ్రామం. దసరా సందర్భంగా పిల్లలకు సెలవులు రాగానే పిల్లలతో కలిసి తల్లిగారింటికి వస్తాను. పూల పండుగ, దుర్గా నవరాత్రులు, దసరా ఇక్కడే చేసుకుంటాను.

– గంగమణి

పుట్టింట్లోనే పండుగ

కాగజ్‌నగర్‌టౌన్‌: బతుకమ్మ పండుగను ప్రతీ సంవత్సరం పుట్టింట్లోనే కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకుంటాం. ఉద్యోగరీత్య కరీంనగర్‌లో స్థిరపడ్డాను. కాగజ్‌నగర్‌కు వచ్చి బంధువులు, చిన్ననాటి స్నేహితులతో కలిసి బతుకమ్మలను పేర్చి ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకుంటాను.

– రత్నప్రభ, టీచర్‌

సెలవులు వచ్చాయంటే..

కాగజ్‌నగర్‌టౌన్‌: నాలుగేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉండి చదువుకుంటున్నాను. దసరా సెలవులు వచ్చాయంటే హైదరాబాద్‌ నుంచి సొంతూరు కాగజ్‌నగర్‌కు వస్తా. పండుగకు ఇతర పట్టణాల్లో ఉన్న నా స్నేహితులు అందరూ కాగజ్‌నగర్‌కు వస్తారు. అందరం సద్దుల బతుకమ్మ రోజు ఎస్పీఎం క్రీడా మైదానంలో కలుస్తాం.

– అరుంధతి

18 ఏళ్లుగా సొంతూరిలోనే..

ఆసిఫాబాద్‌అర్బన్‌: నాకు వివాహం జరిగి 18 ఏళ్లు గడిచింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో ఉంటున్నాం. ఇప్పటికీ బతుకమ్మ పండుగకు ఆసిఫాబాద్‌కు పుట్టింటికి వస్తాను. మా కాలనీలోని స్నేహితులతో కలిసి బతుకమ్మ వేడుకలు జరుపుకుంటాం. అందరం ఏకరూప చీరలు ధరించి వేడుకల్లో పాల్గొంటాం.

– కొత్త హాసిని

వారం రోజులు సెలవు పెట్టి..

చెన్నూర్‌: మా అత్తగారిది నిజామాబాద్‌. నా భర్త, నేను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాం. ప్రతీ ఏడాది బతుకమ్మ పండుగకు చెన్నూర్‌కు వస్తా. పల్లెల్లో బతుకమ్మ పండుగ మాజానే వేరుగా ఉంటుంది. వారం రోజులు సెలవు తీసుకొని పండుగ కోసం వచ్చా.

– నీల నవ్యరాణి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

సొంతూరే గుర్తుకొస్తుంది..

ఆసిఫాబాద్‌అర్బన్‌: బతుకమ్మ పండుగ అంటేనే నాకు గుర్తుకొచ్చేది సొంతూరు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న నేను పండుగ వస్తుందంటే ఆసిఫాబాద్‌కు చేరుకుంటాను. చిన్ననాటి స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా గడుపుతాను. పండుగలు కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు. మన మూలాలను గుర్తు చేసుకొనే వేడుక. – కొండ సంగీత, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

రెండు రోజుల ముందే..

ఆసిఫాబాద్‌అర్బన్‌: బతుకమ్మ పండుగ వస్తుందంటే ఎన్ని పనులు ఉన్నా సొంతూరు ఆసిఫాబాద్‌కు రెండు రోజుల ముందుగానే చేరుకుంటాను. ప్రస్తుతం నేను మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉంటున్నాను. పెళ్లి జరిగి 12 సంవత్సరాలైనా బతుకమ్మ పండుగకు అమ్మగారి ఇంటికి వచ్చి అక్కాచెల్లెళ్లు, స్నేహితులతో సంతోషంగా పండుగ జరుపుకుంటాను. – పెండ్యాల సౌమ్య

సొంతూళ్లో జరుపుకోవడం ఇష్టం

చెన్నూర్‌: సొంతూళ్లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా ఇష్టం. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నా. ఎంత బిజీగా ఉన్నా పండుగ కోసం పిల్లలతో చెన్నూర్‌కు వచ్చా. ఇక్కడ అన్ని రకాల సహజ సిద్ధమైన పూలు అందుబాటులో ఉంటాయి. అందరితో కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటాం.

– బచ్చు దివ్య, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

వేరే చోట ఉండలేక..

ఖానాపూర్‌: మేం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో స్థిరపడ్డాం. నా భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తాడు. నేను ఇంట్లోనే టైలరింగ్‌ చేస్తాను. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగకు ఖానాపూర్‌లోని ఇంద్రనగర్‌కు చేరుకుంటాం. పండుగల సమయంలో వేరే చోట ఉండడం కష్టంగా ఉంటుంది. స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంటుంది. – బీమర్తి సుమలత

వయ్యారి భామ పూలోయ్‌.. నీముక్కు ముక్కెరలూ..

అడవి మోదుగుపూలోయ్‌..

నీనుదుట కుంకుమలు..

ఎంతటి అందాల మహరాణివే.. నీచుట్ట్టూ పూలన్నీ చెలికత్తెలే.. నిన్ను చూడాలని ముందుగ వచ్చిందే పువ్వుల దీపావళి..

బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసెలే..

అంటూ ఓ కవి బతుకమ్మను వర్ణిస్తూ రాశారు. బతుకమ్మ పండుగకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఆడబిడ్డలకు అంతే ప్రాధాన్యం ఉంటుంది. యువతులు, మహిళలకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు పండుగ కోసం సొంతూళ్లకు వస్తారు. విదేశాలకు వెళ్లినవారు, వివాహం జరిగి మెట్టినింటికి వెళ్లిన మహిళలూ పుట్టింటికి చేరుకుంటారు. ఎక్కడ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా బతుకమ్మ, దసరా పండుగను మరువకుండా సొంతూరికి చేరుకుని తొమ్మిది రోజులపాటు బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా గడపడం, సంబరాలు చేసుకోవడం పండుగ ప్రత్యేకతను చాటుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకున్నారు. సొంతూళ్లకు వచ్చిన మహిళలు, యువతుల అభిప్రాయాలు వారి మాటల్లో..

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు1
1/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు2
2/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు3
3/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు4
4/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు5
5/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు6
6/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు7
7/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు8
8/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు9
9/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు10
10/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు11
11/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు12
12/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు13
13/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు14
14/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు15
15/15

● బతుకమ్మ వేడుకలకు సొంతూళ్లకు యువతులు, మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement