
‘బీఎంఎస్ కృషితోనే మెరుగైన బోనస్’
నస్పూర్: బీఎంఎస్ కృషి ఫలితంగానే కార్మికులకు మెరుగైన బోనస్ వస్తోందని సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే 5 గనిపై శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న కోల్‌కతాలో కోల్ ఇండియా యాజమాన్యంతో జరిగిన సమావేశంలో బీఎంఎస్ వేజ్‌బోర్డు సభ్యులు సుధీర్‌గురుడే, సుర్జీత్ సింగ్, పవన్‌కుమార్‌లు పాల్గొని ప్రాఫిట్ లింక్డ్ రివార్డు(పీఎల్‌ఆర్)దీపావళి బోనస్‌ను రూ.103000 చెల్లించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఏరియా ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌రెడ్డి, నాయకులు సారంగపాణి, రాగం రాజేందర్, ప్రభాకర్, రమేశ్, మేకల స్వామి, రాజారాం, కిరణ్, రామకృష్ణ, తిరుపతి, అరుణ్‌కుమార్, ప్రశాంత్, మిట్టపల్లి మొగిలి తదితరులు పాల్గొన్నారు.
‘గర్భిణులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి’
ఇంద్రవెల్లి: గర్భిణులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. గర్భిణుల ఆరోగ్య వివరాలు, అందుతున్న వైద్య సేవలు, తీసుకుంటున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోండి, కొలాం భాషలో ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ గర్భిణులు ప్రతీ నెల పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యాధికారి కుడ్మేత మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, వైద్యులు వసంత్‌రావ్, పూజిత, హెచ్‌ఈవో నాందేవ్, హెల్త్ సూపర్‌వైజర్ పవార్ సురేశ్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

‘బీఎంఎస్ కృషితోనే మెరుగైన బోనస్’