
అనాథ పిల్లలతో కలెక్టర్ సమావేశం
కై లాస్‌నగర్: పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్స్‌లో భాగంగా అనాథ పిల్లలతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పిల్లల ఆరోగ్యం, వసతి, చదువు, సంరక్షణతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సంరక్షకులతోనూ మాట్లాడారు. సమస్యలను నమోదు చేసుకుని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 202 మంది పిల్లలకు ఆరోగ్యశ్రీ, అలాగే 8 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రతీ మూడు నెలలకోసారి పిల్లలతో సమావేశమవుతామని తెలిపారు. కాగా ఆర్‌బీఎస్‌కే ద్వారా పి ల్లలకు రక్తపరీక్షలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, డీడబ్ల్యూవో మిల్కా, ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.