
అమ్మవారికి రూ.11 లక్షల కరెన్సీ హారం
లోకేశ్వరం: మండలంలోని ధర్మోర, పంచగుడి గ్రామాల్లో దుర్గాదేవి శుక్రవారం సరస్వతి దేవి (మూల నక్షత్రం) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ధర్మోర గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి తన సొంత డబ్బులు రూ.11 లక్షలు, పంచగుడిలో గ్రామస్తులు రూ.5లక్షల విలువైన నోట్లను హారాలుగా మార్చి అమ్మవారి మెడలో అలంకరించారు.
రూ.8.50 లక్షల కరెన్సీ హారం..
ఖానాపూర్: పట్టణంలోని గాంధీనగర్‌తోపాటు తర్లపాడ్ గ్రామంలోని దుర్గామాత మండపంలో దుర్గాదేవిని శుక్రవారం కరెన్సీతో అలంకరించారు. తర్లపాడ్‌లో పెద్ద ఎత్తున రూ.8.50 లక్షల కరెన్సీ హారంతో దుర్గామాతను అలంకరించారు.
నిర్మల్‌లో రూ.12 లక్షల నగదుతో..
నిర్మల్‌టౌన్: నిర్మల్ ధ్యాగవాడ హనుమాన్ ఆలయంలో ప్రతిష్టించిన దుర్గామాతను శుక్రవారం ధనలక్ష్మిగా అలంకరించారు. రూ.100, రూ.200, రూ.500 నోట్లతో మొత్తం రూ.12,58,571 కరెన్సీతో అలంకరించారు.