
గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్ విక్రయాలు
కై లాస్‌నగర్: కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌ను విక్రయిస్తున్న ఘటన శుక్రవారం బల్దియా అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూసింది. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌లో గల సాయి నాగరాజు ట్రేడర్స్‌లో బల్దియా శానిటరీ ఇన్స్‌పెక్టర్ బైరీ శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువు మీరిన నాలుగు రకాల కూల్‌డ్రింక్స్‌ను వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. దీనిపై ట్రేడర్స్ యజమాని నగేశ్‌ను ప్రశ్నించగా వాటిని తిరిగి కంపెనీకి వెనక్కి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. సదరు వ్యాపారి సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రూ.5వేల జరిమానా విధించారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కావొద్దని హెచ్చరించారు. బల్దియా పర్యావరణ ఇంజనీర్ అవి కిరణ్, శేఖర్ ఉన్నారు.