
ఉమ్మడి జిల్లా వుషూ జట్ల ఎంపిక
నస్పూర్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని సాధన గ్రీన్ కిడ్స్ పాఠశాల ఆవరణలో ఉమ్మడి జిల్లా అండర్–17, 19 బాలబాలికల వుషూ జట్లను ఎంపిక చేశారు. సుమారు 70 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–19 విభాగంలో జి.ఆదిత్య, బి.లలిత, టి.చందన, అండర్–19 విభాగంలో ఆర్.కృష్ణ, ఈ.యశ్వంత్, ఆర్.యువరాజ్, ఆదర్శకుమార్, రాజేశ్వరి, సీహెచ్ మహిత, ఎస్.రుచిత, జే.మన్వి, ఎన్.అన్విత, సీహెచ్ రక్షిత, ఐ.హర్షిత, ఎండీ కరిష్మా ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 25 నుంచి 27 వరకు మహబూబాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా సెక్రెటరీ బాబురావు, మంచిర్యాల జిల్లా సెక్రెటరీ యాకూబ్, ఆసిఫాబాద్ జిల్లా సెక్రెటరీ వెంకటేశ్, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శివమహేశ్, పాఠాశాల కరస్పాండెంట్ పెంచాల శ్రీధర్, పీఈటీలు సుదీప్, రాజేందర్, దేవయ్య, సాయికృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు.