
గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి
నార్నూర్: జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డు గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకోవాలన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్, సీఐ ప్రభాకర్, ఎస్సై అఖిల్, సిబ్బంది ఉన్నారు.