
విద్యార్థి ఆత్మహత్య
ఖానాపూర్: తండ్రితో గొడవపడి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బీర్నందికి చెందిన కొండవీని రాజేందర్ కుమారుడు శ్రావణ్ (17) నిర్మల్‌లోని ఓప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం పొలంలో యూరియా వేసేందుకు బస్తా తీసుకురమ్మని చెప్పగా నిరాకరించడంతో పాటు తండ్రితో గొడవపడ్డాడు. చేసేదేంలేక తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. గమనించిన అతని తమ్ముడు సాత్విక్ స్థానికుల సాయంతో కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.