
ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా శంకర్
మంచిర్యాలటౌన్: వాలీబాల్ అసోసియేషన్ ఉ మ్మడి జిల్లా అధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన నల్ల శంకర్, కార్యదర్శిగా మైలారం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్, హనుమంతరెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మంగళవారం రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలీబాల్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.
29న బాసరకు ప్రత్యేక బస్సులు
యువకుడిపై కేసు
మంచిర్యాలక్రైం: బ్లాక్ మెయిలింగ్‌కు పాల్ప డిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు షీ టీమ్ ఎస్సై హైమ తెలిపారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన ఓ యువకు డు, యువతి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆతర్వాత యువకుని ప్రవర్తనలో మార్పు రావడంతో యువతి దూరం పెట్టింది. జీర్ణించుకోలేని యువకుడు గతంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను చూపిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు షీ టీమ్‌ను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆర్జీయూకేటీలో ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో మంగళవారం 56వ ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడంలో ఎన్‌ఎస్‌ఎస్ పాత్ర విశిష్టమైనదన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సేవా దృక్పథం పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా మహిళా సాధికారతపై రూపొందించిన నృత్యనాటిక, బాల కార్మిక నిర్మూలనపై ప్రదర్శించిన నాటకం అందరి మనసులను కదిలించాయి. ఈ ప్రదర్శనలు సమాజంలో సున్నితమైన సమస్యలపై అవగాహన కలిగించడంతో పాటు యువతలో సామాజిక బాధ్యతను మేల్కొలిపాయి.