
23న బతుకమ్మ సంబరాలు
శ్రీరాంపూర్: ఈ నెల 23న హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు ఆ యూనియన్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో సాయంత్రం 6గంటలకు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని, ముఖ్య అతిథిగా అఖిల భారత సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్(హెచ్‌ఎంఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని తెలిపారు. సింగరేణి మహిళలు, కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి, కార్యదర్శి పీ.అశోక్‌కుమార్, కేంద్ర ఉపాధ్యక్షులు గొల్ల సత్యనారాయణ, అడ్లూరి అనిల్, దుర్గం లక్ష్మణ్, నాయకులు వెంకటస్వామి, ఎం.శ్రీనివాస్, సురేందర్, తుల అనిల్ పాల్గొన్నారు.