
క్రీడల్లో సత్తాచాటాలి
జైపూర్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సత్తాచాటాలని శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. మండల కేంద్రంలోని కోటపల్లి గురుకులంలో శుక్రవారం ఎస్‌జీఎఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో అండర్–14 బాలుర ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎస్సై శ్రీధర్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు వరకుమారి, మల్లేశ్, పున్నం, వహిదాబేగం, పద్మ, శ్రీనివాస్, సత్యనారాయణ, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.