
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో నెలకొన్న విద్యుత్ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, జీరో విద్యు త్ ప్రమాదాలే లక్ష్యంగా పనిచేయాలని ఎన్పీడీసీఎల్(ఆపరేషన్) డైరక్టర్ మధుసూదన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో డైరెక్టర్ అశోక్‌తో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. తరచూ బ్రేక్‌డౌన్ అయ్యే డీటీఆర్, టీడీఆర్‌లను గుర్తించి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాలతో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌లైన్ల పునరుద్ధరణకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌ఈ ఉత్తమ్‌జాడే, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.