
సామర్థ్యాల పెంపునకు టీఎల్‌ఎం దోహదం
మంచిర్యాలఅర్బన్: బోధనాభ్యసన ప్రక్రియ సమర్థవంతగా నిర్వహించటానికి, విద్యార్థుల సామర్థ్యాలు పెంపునకు టీఎల్‌ఎం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. కాగా, బోధనాభ్యసన సామగ్రి మేళా(టీఎల్‌ఎం)లో 18 మండలాల నుంచి 170 మంది ఉపాధ్యాయులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీఈవో యాదయ్య తిలకించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు చౌదరి, సత్యనారాయణమూర్తి, డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, ఎంఈవోలు మాళవీదేవి, పోచయ్య, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న టీచర్లు వీరే..
అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయికి ఎంపికై న ఉపాధ్యాయుల వివరాలను డీఈవో యాదయ్య ప్రకటించారు. తెలుగు సబ్జెక్టులో ప్రభాకర్(ప్రథమ), స్వర్ణలత(ద్వితీయ), ఇంగ్లిష్ సబ్జెక్టులో శశికుమార్(ప్రథమ), కిరణ్‌కుమార్(ద్వితీయ), గణితంలో రమేష్(ప్రథమ), శోభ(ద్వితీయ), ఈవీఎస్‌లో సీహెచ్.రాజేశ్(ప్రథమ), హరికృష్ణరెడ్డి(ద్వితీయ), ఉర్దూలో నజీమా అంజుమ్ ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టీచర్లకు డీఈవో యాదయ్య ప్రశంసాపత్రాలు అందజేశారు.