
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి
మంచిర్యాలక్రైం: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న నాగర్‌కర్నూల్, నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులపై జరగిన దాడులను తీవ్రంగా ఖండించారు. అనంతరం విధులు బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కోశాధికారి దత్తాత్రేయ, స్పోర్ట్స్ కార్యదర్శి రంగు వేణుకుమార్, లైబ్రరీ కార్యదర్శి రంజీత్ కుమార్‌గౌడ్, కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, న్యాయవాదులు గాజుల రమణరెడ్డి, సంతోష్‌గౌడ్, సెల్వరా జ్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్ బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు.
విధుల బహిష్కరణ
లక్సెట్టిపేట: న్యాయవాదులపై దాడికి నిరసనగా మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు సత్తన్న, న్యాయవాదులు పాల్గొన్నారు.