
దారిని పరిశీలించిన సబ్ కలెక్టర్
బెల్లంపల్లి: బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ కోసం ఆటో స్టాండ్ మధ్యలో నుంచి ప్రతిపాదించిన దారిని సబ్ కలెక్టర్ మనోజ్ గురువారం పరిశీలించారు. ప్రస్తుత సమీకృత కూరగాయల మార్కెట్‌కు రోడ్డు అవతలి వైపు ఉన్న ఆటో స్టాండ్‌ను చీల్చి దారి తీయడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, తద్వారా ఆటోస్టాండ్ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఆటో యూనియన్ నాయకులు ఇటీవల సబ్‌కలెక్టర్ మనోజ్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ స్థలాన్ని పరి శీలించారు. ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు మాట్లాడుతూ 30 ఏళ్ల నుంచి ఆటోలపై ఆధారపడి జీవిస్తున్నామని, ఆటోస్టాండ్‌లను అధికారుల అండతో అక్రమార్కులు కబ్జా చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రస్తుత ఆటోస్టాండ్ అన్యాక్రాంతం కాకుండా చూడాలని వేడుకోగా సబ్‌కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్ట రాంకుమార్, కమిటీ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.