
యూరియా కోసం రైతుల రాస్తారోకో
జన్నారం/వేమనపల్లి/చెన్నూర్‌రూరల్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): యూరియా కోసం జన్నారం మండల కేంద్రంలోని గ్రోమోర్ దుకాణం ఎదుట రైతులు శనివారం రాస్తారోకో చేశారు. పట్టాపాస్‌బుక్, ఆధార్‌కార్డులు అందజేసిన రైతుల సెల్‌కు ఓటీపీ రావాల్సి ఉంటుంది. ఓటీపీ రావడంలో జాప్యం జరుగుతుండడంతో మధ్యాహ్నం 3గంటల వరకు 175బస్తాలు మాత్రమే పంపిణీ చేశారు. ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆగ్రహించి రోడ్డుపై బైఠాయించారు. వరుసలో ఉంటే యూరియా అందేలా చూస్తామని ఏఎస్సై నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం వరుసలో నిలబెట్టి యూరియా
పంపిణీ చేశారు.
మహిళల కోసం ప్రత్యేక చట్టాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మహిళల కో సం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసిందని లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కె.సాయికిరణ్ అన్నారు. శనివారం ముల్కల్లలో గల ప్రభ నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞానసదస్సుకు ఆయన ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. మహిళలపై లైంగిక దాడులు, వరకట్న వేధింపులు జరిగితే నింది తులకు చట్టాలు కఠిన శిక్షలు విధిస్తున్నాయన్నారు. లక్సెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి సత్తన్న, న్యాయవాదులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.