
స్ట్రక్చరల్ సమావేశంలో డిమాండ్లు
శ్రీరాంపూర్: సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు సంఘం, ఏఐటీయూసీ నాయకులకు మధ్య ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం జరిగింది. జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమావేశానికి జీఎం ఎం.శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్కే బాజీసైదా, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల పలు డిమాండ్లపై చర్చించారు. ఎస్‌ఆర్పీ 3 గనిలో రెస్ట్ హాల్ ఎత్తును పెంచి రూఫ్‌షీట్లు మార్చాలని కోరారు. క్యాంటీన్ పూర్తిగా ఆధునికీకరించాలని, మహిళల కోసం ప్రత్యేక వాష్‌రూమ్స్‌ను నిర్మించాలన్నారు. ఎస్‌ఆర్పీ 1 గనిలో కోల్‌కట్టర్ రూమ్‌లను బాగు చేయాలన్నారు. ఈ సమస్యలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. సమావేశంలో యూనియన్ చర్చల ప్రతినిధులు కొట్టే కిషన్ రావు, భద్రి బుచ్చయ్య, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.