
ఐరన్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి
ఖానాపూర్: మారుమూల పల్లెలోని అటవీ ప్రాంతాల దృష్ట్యా ఐరన్ బ్రిడ్జిల నిర్మాణానికి అటవీశాఖ అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రమంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ శుక్రవారం రాత్రి వినతిపత్రం అందజేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు వంతెనలు లేక ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పలుచోట్ల ఐరన్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని విన్నవించారు. ఉట్నూర్‌తోపాటు పెంబి మండలాల్లో మొత్తం ఆరు ఐరన్ బ్రిడ్జిల నిర్మాణానికి సుమారు రూ.18 కోట్ల నిధులు మంజూరు చేయాలని గతంలో మంత్రి సీతక్కకు విన్నవించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి డాక్టర్ సువర్ణను కలిసి ఈవిషయమై వినతిపత్రం అందజేశారు.