
యూరియా కోసం ఆందోళన
వేమనపల్లి: యూరియా కోసం నీల్వాయిలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. 660 యూరియా బస్తాలు రాగా ఏఓ వీరన్న రైతులకు ఒక్కో బస్తా పంపిణీ చేశారు. ఏడుగురు రైతులకు కూపన్లు ఇచ్చిన యూరియా బస్తాలు లేకపోవడంతో ఆందోళనకు దిగారు. రెండు రోజుల్లో మళ్లీ యూరియా వస్తుందని, అందజేస్తామని అధికారులు చెప్పడంతో శాంతించారు. ఎస్సై కోటేష్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యవసాయాధికారి పరిశీలన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం పడ్తనపల్లి పీఏసీఎస్‌లో రైతులకు విక్రయిస్తున్న యూరియా నిల్వలను జిల్లా వ్యవసాయాధికారి సురేఖ పరిశీలించారు. రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ మామిడి కృష్ణ, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్, ఏఓ కృష్ణ పాల్గొన్నారు.