
జాతీయ సదస్సు విజయవంతం చేయండి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్‌లో రెండ్రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు విజయవంతం చేయాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్‌ఆర్ రాజేందర్‌సింగ్ అన్నారు. బుధవారం స్థానిక డిగ్రీ కళాశాలను సందర్శించిన సందర్భంగా సద స్సు కరపత్రాలను సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. కళాశాల యాజమాన్యం సమస్యలు, ప్రస్తుత అవసరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఐరన్ మ్యాన్స్ విజినరీ లీడర్‌షిప్ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే.కిషన్ ఓజా, సెమినార్ కన్వీనర్ డాక్టర్ కే.రాజయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నరేందర్‌రెడ్డి, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.గంగయ్య, స్టాఫ్ క్లబ్ సెక్రెటరీ గోపాలకృష్ణ, ఎన్‌సీసీ కమాండర్ జాడి మహేష్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.