
ఘనంగా సాయుధ పోరాట వార్షికోత్సవం
రామకృష్ణాపూర్: తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆ నాడు అసలు సిసలైన పోరాటాలు సాగించిన అమరవీరులకు నివాళులర్పిస్తూ వారిని స్మరించుకునేందుకు సాయుధ పోరాట దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని పలు ప్రధానకూడళ్లలోనూ జెండా ఆవిష్కరణలు చేశారు. కార్యక్రమంలో నా యకులు మిట్టపెల్లి శ్రీనివాస్, గోపి, ఇప్పకాయల లింగయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.