
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
భీమారం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద మంగళవారం రైతులు బారులు తీరారు. 444 బస్తాల యూరియాను ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ద్వారా టోకెన్లు ఇచ్చి ఒక్కో బస్తా అందజేశారు.
తాండూర్ మండలం కొత్తపల్లి రైతువేదికలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. రైతులు భారీగా తరలి రావడంతో సీఐ దేవయ్య, ఎస్సై కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. చాలామంది యూరియా దొరకక నిరాశతో వెనుదిరిగారు.
కాసిపేట మండలం ధర్మరావుపేట సహకార సంఘానికి 266 బస్తాలు యూరియా రావడంతో రైతు వేదిక వద్ద బారులు తీరారు. ఆధార్‌కా ర్డు, పట్టాపాస్‌బుక్ ఆధారంగా రైతులకు టోకె న్లు ఇచ్చి ఒక్కో బస్తా చొప్పున అందజేశారు. బుధవారం మరో లోడ్ వస్తుందని తెలిపారు. మండల వ్యవసాయాధికారి ప్రభాకర్, ఏఈవో శ్రీధర్, సహకార సంఘం సీఈవో రాజశేఖర్ పాల్గొన్నారు. కాసిపేట ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వేమనపల్లి: రాస్తారోకో చేస్తున్న రైతులు
తాండూర్: రైతువేదిక వద్ద కూపన్ల కోసం నిరీక్షణ
వేమనపల్లి/భీమారం/తాండూర్/కాసిపేట: వేమనపల్లి మండలం నీల్వాయి పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రైతులు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. అధికార పార్టీ నాయకులు అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గత నెల 28న యూరియా వచ్చిందని, ఇప్పటికీ రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సింగిల్ విండో చైర్మన్ కుబిడె వెంకటేశం తెలిపారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్, మాజీ సర్పంచ్‌లు కొండగొర్ల బాపు, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు