
ఇంద్రవెల్లిలో డెంగీ కేసు నమోదు
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని ప్రబుద్ధనగర్‌లో ఓ బాలుడికి డెంగీ పాజిటివ్ వచ్చింది. వివరాలు.. మండల కేంద్రంలోని ప్రబుద్ధనగర్‌కు చెందిన గా యక్‌వాడ్ సచిన్, సంజీవన దంపతుల మూడేళ్ల కు మారుడు సంఘర్శ్‌కు వారం రోజులుగా జ్వరం వ స్తోంది. కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ప లు ఆస్పత్రుల్లో వైద్యం అందించినా తగ్గలేదు. రెండురోజుల క్రితం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ గా నిర్ధారించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరి స్థి తి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపా రు. మంగళవారం విషయం తెలుసుకున్న ఎంపీడీవో జీవన్‌రెడ్డి, గ్రామపంచాయతీ ఈవో సంజీవ్‌రా వు, అధికారులు ప్రబుద్ధనగర్‌ను సందర్శించారు. గాయక్‌వాడ్ సచిన్ ఇంటి పరిసర ప్రాంతాన్ని పరిశీ లించారు. పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టారు.