
జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలి
ఆదిలాబాద్: జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలకు ఎంపికై న జిల్లాకు చెందిన ఫిజి కల్ డైరెక్టర్ (పీడీ)లు ప్రతిభ కనబరచాలని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (పెటా) జిల్లా అధ్యక్షుడు పార్థసారథి సూచించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న పీడీలు జీ.నాందేవ్ (జెడ్పీఎస్‌ఎస్, సుంకిడి), జాదవ్ రవీందర్ (జెడ్పీఎస్‌ఎస్, భరంపూర్)ను జిల్లా కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో నాందేవ్ 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించగా, జాదవ్ రవీందర్ లాన్ టెన్నిస్ క్రీడలో ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. ఇరువురు నవంబర్‌లో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. పెటా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికుమార్, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామేశ్వర్, కోశాధికారి శ్రీనివాస్, గోపాల్, రాము, రవీందర్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.