
వైద్యులు, సిబ్బందికి వ్యాక్సిన్
ఈ నెల 9, 10, 11 తేదీల్లో వైద్యులు, సిబ్బందికి ముందస్తుగా హెపటైటిస్ వ్యాక్సిన్ వేయనున్నాం. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సూపరింటెండెంట్‌తో పాటు, ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట్ సీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది, ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులకు వ్యాక్సిన్ వేయనున్నాం. ఆతర్వాత పీహెచ్‌సీలతో పాటు ఇతర ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యసిబ్బందికి, ఆతర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర సిబ్బంది, డీఎంహెచ్‌వోలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది.
– డాక్టర్ అనిత,
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో