
అలల సవ్వడిలా..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరి తీర ప్రాంతాలు, ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్ట్‌ల నుంచి వచ్చిన వరద నీటితో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారి జలకళను సంతరించుకుంది. ఈ క్రమంలో ఇటు గోదావరి, అటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ అంతా కూడా వీచే గాలులతో సముద్రపు అలల్లా ఎగిసిపడుతున్నాయి. సముద్రాల్లో అలల మాదిరి సవ్వడి చేస్తూ ఆహ్లాదం పంచుతూ ఆకట్టుకుంటున్నాయి. రాపల్లి గ్రామ శివారులో గోదావరి తీరాన కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
– మంచిర్యాలరూరల్(హాజీపూర్)