సింగరేణి క్రీడలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

సింగరేణి క్రీడలకు వేళాయె..

Sep 8 2025 4:44 AM | Updated on Sep 8 2025 4:44 AM

సింగరేణి క్రీడలకు వేళాయె..

సింగరేణి క్రీడలకు వేళాయె..

● ఈ నెల 10 నుంచి ఏరియా వార్షిక పోటీలు ప్రారంభం ● శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో ఏర్పాట్లు

శ్రీరాంపూర్‌: సింగరేణి శ్రీరాంపూర్‌ ఏరియా డబ్ల్యూపీఎస్‌, జీఏ 2025–26 వార్షిక క్రీడా షెడ్యూల్‌ను యాజమాన్యం ప్రకటించింది. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ క్రీడాపోటీలు ఈ నెల 10 నుంచి శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. ఏరియాలోని గనులు, డిపార్టుమెంట్లను కలిపి మొత్తం నాలుగు గ్రూప్‌లుగా చేశారు. ఈ గ్రూపుల మధ్య పోటీలు నిర్వహించనున్నారు. ఏరియా స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను కంపెనీ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయ స్థాయిలో జరిగే కోలిండియా పోటీలకు ఎంపిక చేస్తారు.

ప్రగతి మైదానంలోనే పోటీలు

ఈ ఏడాది కూడా క్రీడా పోటీలన్నీ ప్రగతి మైదానంలో నిర్వహించనున్నారు. 10న వాలీబాల్‌, 11న బాస్కెట్‌బాల్‌, 12న బాల్‌ బ్యాడ్మింటిన్‌ పోటీలు ఉంటాయి. ఇందులో ప్రతీ గ్రూప్‌ నుంచి 8 మంది క్రీడాకారులు జట్టులో ఉంటారు. 13, 14 తేదీల్లో అథ్లెటిక్స్‌ (మెన్‌, ఉమెన్‌), త్రోబాల్‌ (ఉమెన్‌), స్విమ్మింగ్‌ (మెన్‌), 14న బాడీ బిల్డింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, 15న ఫుట్‌బాల్‌, 16న హాకీ పోటీలు ఉంటాయి. ఇందులో ప్రతీ జట్టులో 14 మంది క్రీడాకారులు ఉంటారు. 17న లాన్‌టెన్నిస్‌, 18న కబడ్డీ, 20, 21న క్రికెట్‌, 21న చెస్‌, క్యారమ్స్‌ పోటీలు, 26న కల్చరల్‌ పోటీలు నిర్వహించనున్నారు. స్విమ్మింగ్‌ పోటీలు సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్‌ పూల్‌లో జరుగనున్నాయి.

స్పోర్ట్స్‌ మెటీరియల్‌ కొరత..

సింగరేణి వార్షిక క్రీడల షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు క్రీడా సామగ్రి, కీడ్రాకారులకు దుస్తులు రాలేదు. గడిచిన మూడేళ్ల నుంచి ఇవి సరఫరా కావడంలేదు. దీంతో వాలీబాల్స్‌, ఫుట్‌బాల్స్‌, హాకీ స్టిక్స్‌, నెట్స్‌, తదితర క్రీడాసామగ్రి కొరత తీవ్రంగా ఉంది. క్రీడాకారులకు అందించే క్రీడాదుస్తులు, షూస్‌ కూడా సమకూర్చకుండానే పోటీలు నిర్వహించడానికి సిద్ధం కావడంతో క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ రానురాను క్రీడలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని క్రీడాకారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే మెటీరియల్‌ కొరతపై అధికారులను సంప్రదించగా కొనుగోలు పూర్తి అయ్యిందని, ఒకటి రెండు రోజుల్లో క్రీడా సామగ్రి, దస్తులు రాబోతున్నాయని తెలిపారు.

గ్రూపులు ఇవే..

ఎస్పార్పీ గ్రూప్‌ : ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3, 3ఏ

ఆర్కే I గ్రూప్‌ : ఆర్కే 6, ఐకే 1ఏ

ఆర్కే II గ్రూప్‌ : ఆర్కే 7, ఆర్కే న్యూటెక్‌

అదర్స్‌ గ్రూప్‌ : ఎస్సార్పీ ఓసీపీ, ఐకే ఓసీపీ, ఎస్టీపీపీ, ఇతర డిపార్టుమెంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement