
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
మంచిర్యాలఅర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎస్‌టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూటీఎస్) జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, పెన్షనర్‌ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఎస్‌టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా భట్టారి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ఒడిగే కృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా కరుణాకర్, ఉపాధ్యక్షులుగా సత్తయ్య, బాపు, వీ.పద్మ, కార్యదర్శులుగా మన్మోహన్, కే.మహాలక్ష్మి, పి.సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శిగా సుమన్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిన్నింటి తిరుపతిరావు వ్యవహరించారు. అనంతరం ఇటీవల పదవీ విరమణ పొందిన బీసగోని శంకర్‌గౌడ్, లింగయ్య, సుజాత నర్సయ్య, పదోన్నతి పొందిన దామోదర్, వెంకటేశ్వర్లును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పూర్వ అధ్యక్షుడు శంకర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.