
తాను మరణించినా నలుగురికి ప్రాణదానం
లక్ష్మణచాంద: తాను మృతి చెందినా తన అవయవాలను మ రో నలుగురికి ఇచ్చి ప్రాణదానం చేశాడు. మండల కేంద్రానికి చెందిన భీమ రమేశ్ (28) మూడేళ్లక్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. గత నెల 8న పని ముగించుకొని ట్రక్కులో రూమ్‌కు వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఎంఎంఎస్ ఆస్పత్రి కి తరలించి చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో 25న మృతి చెందాడు. మృతు డు గతంలో తన అవయవాలు దానం చేస్తానని రాసి ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యు ల అంగీకారంతో నాలుగు అవయవాలను తీసుకున్నట్లు అతని మిత్రులు తెలిపారు. 13 రోజుల తరువాత శనివారం మృతదేహం స్వగ్రామం చేరుకుంది. మృతునికి భార్య సుజాత, ఇద్దరు కుమారులు ఉన్నారు.