
వసతిగృహ విద్యార్థులపై దాడి
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టు మెట్రిక్ హాస్టల్ విద్యార్థులపై కొంతమంది దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాల ఆవరణలో శుక్రవారం వినాయక నిమజ్జనంలో విద్యార్థులు నృత్యం చేస్తుండగా ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. రాత్రి బయటినుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులు ముగ్గురు విద్యార్థులపై దాడి చేశారు. హాస్టల్ ఇన్‌చా ర్జి వార్డెన్ శ్రీనివాస్, వాచ్‌మెన్ క్రాంతికుమార్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు రావడంతో సదరు వ్యక్తులు పారిపోయారు. శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషో త్తం నాయక్, ఏబీసీడబ్ల్యూవో భాగ్యవతి, సెక్టోరి యల్ అధికారి సత్యనారాయణ మూర్తి, డీఆర్పీ జనార్దన్ హాస్టల్‌కు వచ్చి వివరాలు సేకరించారు. వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నడని చెప్పడంతో కలెక్టర్‌కు నివేదించి చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థి సంఘాల ధర్నా
విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ, యూఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట ఆందోళన చేపట్టి అధికారి పురుషోత్తం నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కారకులైన వార్డెన్, వాచ్‌మెన్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, మిట్టపల్లి తిరుపతి, ప్రభంజనం, సతీష్, తదితరులు పాల్గొన్నారు.