
ఆర్జీయూకేటీలో యక్షగాన కళా ప్రదర్శన
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో సోమవారం స్పీక్ మాకే హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో యక్షగాన కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యువతలో సాంస్కృతిక అవగాహన పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ‘స్పీక్ మాకే’ సంస్థ తెలంగాణ 4వ రాష్ట్ర కన్వెన్షన్‌ను ఈ ఏడాది బాసర క్యాంపస్‌లో నిర్వహించడం గర్వకారణమన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాకారుడు శ్రీ కేరమనే శివానంద హెగ్డే మాట్లాడుతూ ఇంత గొప్ప వేదికపై ప్రదర్శించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా రామాయణంలోని ‘సీతాపహరణం’ ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని, రావణుని అధర్మపు చర్యలు, సీతమ్మ త్యాగం, రామలక్ష్మణుల బాధలను అత్యంత హృద్యంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య మురళీదర్శన్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.