
ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల బెడద
ఖానాపూర్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల చేతివాటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఎర్వచింతల్ గ్రామానికి చెందిన కొడారి మంజుల, ఎడ్ల వనిత సోమవారం స్వగ్రామాలకు వెళ్లేందుకు ఖానాపూర్ బస్టాండ్‌కు వచ్చారు. బస్సు ఎక్కే క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు మంజుల పర్సులో ఉన్న రూ.11,300, వనిత పర్సులో ఉన్న రూ.500 నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టారు. పర్సులో నగదుతో పాటు ఏటీఎం కార్డు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫొటోలను చోరీ చేశారని బాధితులు పేర్కొన్నారు.