
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్
ఉట్నూర్‌రూరల్: ప్రజలు ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు. ఆదివారం ఉట్నూర్‌లోని మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో డ్రీమ్ డాలర్ లైఫ్ పేరుతో టోకెన్ ప్యాకెట్ అనే అప్లికేషన్ నందు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ను జిల్లా పోలీసులు గుర్తించారన్నారు. ఇందులో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. సోమవారం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని వణికి చెందిన రితేష్ వాతేకర్ ద్వారా ఉట్నూర్ మండలంలోని షాంపూర్‌కు చెందిన చౌకటే సంగ్రామ్, మెండె నారాయణ మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లోని అప్లికేషన్ నందు రూ.1500 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఇరువురు దాదాపు 11 మందిని చేర్పించగా ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వారికి వెళ్లినట్లు విచారణలో తెలిసిందన్నారు. ప్రజలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.