
పాముకాటుకు ఒకరి మృతి
కౌటాల: మండలంలోని మొగడ్‌దగడ్ గ్రామానికి చెందిన ఉర్వత్ నాందేవ్ (55) పాముకాటుకు గురై మృతి చెందినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నాందేవ్ తన భార్య నిర్మలతో కలిసి గ్రామ శివారులోని తమ పొలానికి వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా నాందేవ్‌ను పాము కాటు వేసింది. అతడి భార్య గమనించి వెంటనే నాందేవ్‌ను సిర్పూర్(టి)లోని సామాజిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు కార్తిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.