
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు హన్మకొండ వేదికగా ఈనెల 3 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్ జోన్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో పీ స్వాతి (60 మీటర్స్ రన్నింగ్), పీ కావ్య (60 మీటర్స్), ఎం.శివాని (600 మీటర్స్), పీ రితిక(ట్రయాత్లాన్), వీ మహేశ్ (జావెలిన్ త్రో), డీ యువరాజ్ (80 హర్డిల్స్) ఎస్.చరణ్ (ట్రయాత్లాన్–ఏ), ఎం.హన్మంతు (ట్రయాత్లాన్–బీ) ఉన్నారు. వీరిని డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్ శుక్రవారం అభినందించారు. రాష్ట్ర స్థాయి పో టీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సురేశ్, అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ ఉన్నారు.