
డీఈవోలుగా ఐఏఎస్ అధికారులు
● ఆదిలాబాద్‌కు ఐటీడీఏ పీవో ● ఆసిఫాబాద్‌కు అడిషనల్ కలెక్టర్ ● అక్రమార్కుల్లో మొదలైన గుబులు ● విద్యావ్యవస్థ గాడిలో పడేనా?
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యాశాఖకు తొలిసారిగా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇన్‌చార్జి అధికారితో కొనసాగుతున్న డీఈవో పోస్టులో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆమె ఇప్పటికే ఐటీడీఏ పీవోతో పాటు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా, ఆది లాబాద్ మున్సిపల్ ప్రత్యేకాధికారిగా అదనపు బా ధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐఏఎస్ అధికారికి జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖు ష్బూ గుప్తాకు విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరుండడంతో అక్రమార్కులు, డుమ్మా టీచర్లలో గుబులు మొదలైంది. 2018నుంచి రెగ్యులర్ అధికా రి లేక విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. అప్పటి నుంచి ఇన్‌చార్జి అధికారులతోనే కాలం నెట్టుకువస్తున్నారు. ఇన్‌చార్జి అధికారులకు శాఖపై పట్టులేకపోవడంతో పలువురు ఉపాధ్యాయులు, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఏడేళ్లుగా ఇన్‌చార్జీలే..
2018 నుంచి జిల్లాలో ఇన్‌చార్జి అధికారులతోనే విద్యావ్యవస్థ కొనసాగుతోంది. అప్పట్లో పనిచేసిన జనార్దన్‌రావును కార్యాలయ ఉద్యోగులు, ఉపాధ్యా య సంఘ నాయకులతో ఉన్న గొడవల కారణంగా అప్పటి కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మూడేళ్ల పాటు పనిచేసిన అతడిని నిర్మల్ జిల్లాకు బదిలీ చేయడంతో అక్కడ ఏడీగా పనిచేస్తున్న ప్రణీతను జిల్లా విద్యాధికారిగా నియమించారు. ఇటీవల ఆ మె ఉద్యోగ విరమణ పొందడంతో మోడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన విధుల్లో చేరలేదు. దీంతో జిల్లా వయోజన విద్యాశాఖ డీడీగా ఉన్న శ్రీనివాసరెడ్డికి కలెక్టర్ రాజర్షి షా ఇన్‌చార్జి డీఈవోగా బాధ్యతలు అప్పగించారు. ఆయన నాలుగు నెలల పాటు ఇన్‌చార్జి డీఈవోగా విధులు నిర్వహించారు. ప్రస్తు తం అతడిని తప్పిస్తూ ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాకు బాధ్యతలు అప్పగించారు. అయితే కీలకమైన ఐటీడీఏ పీవో పోస్టుతో పాటు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారిగా ఇప్పటికే మూడు ప్రధాన పోస్టుల్లో కొనసాగుతుండగా ఆమెకే జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు అప్పగించడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. కాగా, శనివారం నుంచి జిల్లాలో ఉపాధ్యా య ప్రమోషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ ప్రక్రియ సాఫీగా నిర్వహించడంతో పాటు విద్యాశాఖను ఏ విధంగా గాడిన పెడతారనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఐఏఎస్ అఽఽధికారిని డీఈవోగా నియమించడంతో విద్యాశాఖలో అక్రమాలకు చెక్ పడనున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఆదిలాబాద్ డీఈవో కార్యాలయం
ఆసిఫాబాద్‌కు అడిషనల్ కలెక్టర్ తివారీ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా విద్యాశాఖలో ఏడాదిగా ఇన్‌చార్జి డీఈవో పాలన కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య ఇన్‌చార్జి డీఈవో కొనసాగతుండగా శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ కి అదనంగా డీఈవో బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

డీఈవోలుగా ఐఏఎస్ అధికారులు