
పరీక్షలో ఫెయిలై విద్యార్థి ఆత్మహత్య
ఆదిలాబాద్‌టౌన్: పరీక్షల్లో ఫెయిలయ్యానని మనస్తాపానికి గురైన జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసముంటున్న భూమన్న–గీత దంపతులకు కూతురు, కుమారుడు రిత్విక్ (17) ఉన్నారు. రిత్విక్ జిల్లా కేంద్రంలోని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నెల క్రితం ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదల కాగా, ఆరు సబ్జెక్టులకు ఐదింటిలో ఫెయిలయ్యాడు. దీంతో కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురవుతున్నాడు. రెండు రోజుల నుంచి కళాశాలకూ రాలేదని కళాశాల ప్రిన్సి పల్ తెలిపారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. కూతురు లక్సెట్టిపేటలో ని వసతిగృహంలో ఉంటూ చదువుకుంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రిత్విక్ చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు రోధించిన తీరు అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో యువతి..
నెన్నెల: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జంగాల్‌పేట పంచాయ తీ పరిధి ఖర్జి గ్రామానికి చెందిన గిరిజన యువతి అద్దెరపల్లి మమత(19) పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఉపాధి కోసం ఏడాది క్రితం రూ.1.60 లక్షలతో బెల్లంపల్లిలో సెకండ్ హ్యాండ్ ఆటో కొనుగోలు చేసింది. డ్రైవర్‌తో దానిని నడిపించుకుంటూ అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటోంది. అయితే.. అప్పటికే సదరు ఆటోపై ఫైనాన్స్ ఉంద న్న విషయం తెలియక మోసపోయింది. ఆటోను అమ్మిన వ్యక్తి కిస్తీలు కట్టకపోవడంతో నెల కిందట మమత వద్ద ఉన్న ఆటోను ఫైనాన్స్ వారు సీజ్ చేసి తీసుకెళ్లారు. దీంతో ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా న ష్టం జరగడంతో నిత్యం బాధపడుతోంది. ఈక్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులు కూలీ పనులకు వెళ్లాక ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కు టుంబ సభ్యులు మమత విగతజీవిగా కనిపించడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి నాగేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
కొండాపూర్‌లో యువకుడు..
దండేపల్లి: అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై తహసినొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప మనోజ్ (31) ఏడాది క్రితం వరికోత యంత్రం కొనుగోలు చేశాడు. అది తరచూ మరమ్మతులకు గురికావడంతో దానిని అమ్మేశాడు. మళ్లీ సుమారు రూ.4లక్షల వరకు అప్పు చేసి ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. దానికీ తరచూ రిపేర్లు రావడంతో సరిగా నడవలేదు. దీంతో ట్రాక్టర్ కొనుగోలు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇంట్లో వారితో చెబుతూ బాధపడేవాడు. ఈ విషయంలో భార్య శిరీష అతనికి నచ్చజెప్పి బాధపడవద్దని చెప్పేది. అయినప్పటికీ మనస్తాపంతో మనోజ్ గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయాన్ని తమ బంధువు మల్లేశ్‌కు ఫోన్ చేసి తెలిపాడు. వెంటనే మల్లేశ్ అక్కడికి వెళ్లి మనోజ్‌ను చికిత్స కోసం లక్సెట్టిపేటకు తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పరీక్షలో ఫెయిలై విద్యార్థి ఆత్మహత్య