
సీవోఈ తరలింపుపై ప్రభుత్వానికి నివేదిస్తా
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లోగల కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటకు తరలించడంపై ప్రజల ఆక్షేపణను ప్రభుత్వానికి నివేదిస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. సీవోఈని హ యత్‌నగర్ నుంచి తరలించవద్దని శుక్రవారం ఆది మ గిరిజన కొలాం సేవా సంఘం ప్రతినిధులు పీ వోకు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. 200 మంది ఆదివాసీ విద్యార్థులు సీవోఈలో ఇంటర్ చదువుతున్నారని తెలిపారు. సీవోఈని అచ్చంపేటకు తరలిస్తే మరో 150 కిలోమీటర్ల దూరభారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తంజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ఆదిమ గిరిజన కొ లాం సేవా సంఘం ప్రతినిధులు అందించిన వినతిపత్రంపై గిరిజన సంక్షేమ కమిషనర్‌తో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. సంఘం ప్రతినిధులు కొడప సోనేరావు, మాడవి గోవిందరావు, టేకం లక్ష్మణ్, సిడాం అన్నిగా, మడవి నాగరావు, మడవి కిషన్, టేకం భీమ్ రావు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాకు దివ్యాంగులు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం పథకాలు అమలు చేయాలని కోరారు. ప్రతీ దివ్యాంగుడికి 35 కిలోల బియ్యం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. 165 రోజులు పని కల్పించాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు, 100శాతం సబ్సిడీ రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అ నంతరం పీవో మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్ర భుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పా రు. నాగేశ్, గేడం జమున, జగతిరావు, బుచ్చన్న, సరోజ, ప్రియాంక తదితరులున్నారు.