
2027 నాటికి మలేరియా నిర్మూలనే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: దేశంలో 2027 నాటికి మలేరియా నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా మలేరియా నివారణ అధికారి మెట్‌పెల్లివార్ శ్రీధర్ అన్నారు. సోమవారం న్యూ ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమాన్ని నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీస్ కంట్రోల్, టీసీఐ ఫౌండేషన్ నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అధికారులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఏడాదికి 2 మలేరియా కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించినట్లు ఆయన తెలిపారు. మలేరియాను నిర్మూలించేందుకు కృషి చేస్తున్న అధికారులను ఎన్‌సీవీబీడీసీ డైరెక్టర్ తనుజైన్ అభినందించినట్లు పేర్కొన్నారు.