
జాతీయ విద్యాపాలసీ సదస్సుకు ఎంపిక
కెరమెరి/గుడిహత్నూర్ : కేంద్రప్రభుత్వ విద్యా శాఖ నిర్వహిస్తున్న అఖిల భారతీయ శిక్షా సమగ్రం–2025 ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం నిర్వహించే 5వ జాతీ య విద్యా పాలసీ వార్షికోత్సవ సదస్సుకు ఇద్ద రు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఆదిలా బాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు భెదోడ్కర్ సంతోష్ కుమార్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని సావర్‌ఖెడా పీఎంశ్రీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడేర్ల రంగయ్యలు సదస్సుకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు సదస్సుకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.

జాతీయ విద్యాపాలసీ సదస్సుకు ఎంపిక