
నాగమ్మా.. దీవించు
● నేడు నాగుల పంచమి ● పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ ● గ్రామీణ ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యం ● శ్రావణ శుక్ల పంచమి నాగారాధనకు శ్రేష్ఠం
కెరమెరి(ఆసిఫాబాద్): నేడు నాగుల పంచమి.. శ్రావణ శుక్లపంచమి నాగారాధనకు శ్రేష్ఠమని గ్రామీణులు విశ్వసిస్తారు. అందుకే ఇతరత్రా పండుగల మా దిరి నాగపంచమిని కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భారతీయ సంప్రదాయాల్లో మనుషులకు, నాగులకు అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే మహిళలు పాము పుట్టల్లో పాలు పోసి తమ భక్తిని చాటుకుంటారు. నవధాన్యాలతో తయారు చేసిన పుట్నాలను సైతం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు మంగళవారం నాగుల పంచమిని భక్తి శ్రద్ధలతో జరుపుకో నున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు ఉయ్యాలలు ఊగుతూ ఎంతో ఆనందంగా గ డుపుతారు. ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
ఇదీ కథ..
హస్తినపురం రాజైన జనమే జయుడి తండ్రి ప రీక్షిత్తు మహరాజు నాగుపాము కాటు వేయడంతో మరణిస్తాడు. అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి జనమే జయుడు సర్పయాగం చేస్తాడు. ఈ యజ్ఞంలో మంత్ర శక్తి ద్వారా నాగులను రప్పించి య జ్ఞగుండంలో ఆహుతి చేస్తాడు. జనమే జయుడి స ర్పయాగంలో కోట్లాది నాగులు భస్మమై పోతాయి. మనసాదేవి కుమారుడు హస్తికముని ఈ యజ్ఞాన్ని నిరోధిస్తాడు. నాగయజ్ఞం ముగిసిన రోజునే పంచమ తిథి కావడంతో నాగుల పంచమి జరుపుకుంటున్నారు. ఓం నమఃశివాయ.. ఓం నమఃశివయా.. నాగేంద్రహరాయ ఓం నమోఃశివయా అనే నాగ గాయత్రి తొలిమంత్రం వల్ల లేదా శివమంత్రం పఠించడం వల్ల సౌభాగ్యకరమైన..శుభప్రదమైన ఫలితం లభిస్తుందని శాస్త్రావచనం.
నాగరాజుకు నైవేద్యాలు...
శ్రావణ శుద్ధ చతుర్ధశి రోజున సీ్త్రలు ఉపవాసం ఉండి, జాజి సంపెంగ పుష్పాలతో పూజించి పుట్టలో పాలు, పాయసం, కలివిడి, పప్పు, వడ, నువ్వులతో చేసిన ఉండలు, క్షీరాన్నం నాగేంద్రునికి సమర్పిస్తే సర్వదోషాలు హరిస్తాడని, సంతానంలో అవరోధాలు లేకుండా చూస్తాడని భక్తుల విశ్వాసం. నాగుల చవితి, నాగపంచమినాడు నాగదేవతను ఆరాధిస్తే కాలసర్పదోషం, రాహుగ్రహ దోషం తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
నాగవ్రతంతో మేలు
నాగుల పంచమి రోజున శాస్త్రోక్తంగా నాగవ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుందని, అన్ని కార్యాలు సులభంగా జరుగుతాయని ప్రజల నమ్మకం. సీ్త్ర, పురుషుల జాతకంలో సర్పదోశం ఉంటే వారు శుద్ధపంచమినాడు నాగవ్రతాన్ని ఆచరించి ప్రతీనెల శుక్లపంచమికి ఈ వ్రతం చేస్తే సకలప్రాప్తి కలుగుతుందని ప్రతీక. ఈ నేపథ్యంలో నవధాన్యాలతో పుట్నాలను చేసి తియ్యటి పరమాన్నంతో పాటు పాలను పుట్టలో పోయడంతో అంతా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం.
నాగోబా ఆలయం ముస్తాబు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మంగళవారం నిర్వహించే నాగుల పంచమి ఉత్సవాలకు ఆలయం ముస్తాబైంది. రెండురోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. నాగుల పంచమి పురస్కరించుకొని వాలీబాల్, కబడ్డీ క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీఐ మడావి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉత్సాహంగా..
నాగుల పంచమిని గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసి నూతన వస్త్రాలను ధరిస్తాం. నవధాన్యాలతో పుట్నాలను తయారు చేస్తాం. ఆ తర్వాత పుట్టలో పాలు పోస్తాం. భక్తి శ్రద్ధలతో నాగరాజును ఆరాధిస్తాం. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నాం.
– విజయలక్ష్మి, మాజీ సర్పంచ్, ఖైరీ, కెరమెరి

నాగమ్మా.. దీవించు

నాగమ్మా.. దీవించు

నాగమ్మా.. దీవించు