
గత ప్రభుత్వం మహిళలను విస్మరించింది
● మంత్రి గడ్డం వివేక్
చెన్నూర్‌రూరల్: గత ప్రభుత్వం మహిళలను ఆర్థి కంగా బలపరుస్తామని చెప్పి విస్మరించిందని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. చెన్నూర్ మండలం కిష్టంపేటలోని బీఎంఆర్ గార్డెన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. సుమారు 246 మహిళా సంఘాలకు రూ.25 కోట్ల వడ్డి లేని రుణాల చెక్కులను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి అందజేశారు. చెన్నూర్, కోటపల్లి, భీమారం మండలాలకు మంజూరైన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చెన్నూర్‌లో బస్‌డిపో ఏర్పాటు చేయాలని రవాణాశాఖ మంత్రిని కోరామన్నారు. ఈ సందర్భంగా కిష్టంపేట గ్రామ మహిళలు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, తదితరులు పాల్గొన్నారు.