
కార్మికుల రక్షణలో వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు కీలకం
మందమర్రిరూరల్: కార్మికుల రక్షణలో వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు కీలకమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం మందమర్రి ఏరియాలోని యూని యన్ కార్యాలయంలో ఏరియాస్థాయి వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న జరుగనున్న సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశంలో సమస్యలు డీజీఎంఎస్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కేకే–5 గనికి చెందిన సీఐటీయూ నాయకుడు కోరె సిద్దాంత్ ఏఐటీయూసీలో చేరగా కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాసిపేట బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.