
ప్రతిఒక్కరూ చట్టం విలువలు తెలుసుకోవాలి
జైపూర్: మనిషి పుట్టుక నుంచి మరణం వరకు చట్టం వర్తిస్తుందని, చట్టం విలువలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని చెన్నూర్ సివిల్ కోర్టు జడ్జి పర్వతపు రవి అన్నా రు. జైపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో పదోతరగతి, ఇంటర్ విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ కు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫోక్సో పీపీ రాంబాబు, చెన్నూర్ కోర్టు న్యాయవాదులు మహేశ్, పున్నం, బండారి శ్రీనివాస్, రాజేశ్, వినోద్, స్థానిక ఏఎస్సై హబీబ్, కేజీబీవీ ప్రత్యేకాధికారి ఫణిబాల, కోర్టు సిబ్బంది శృతి, తదితరులు పాల్గొన్నారు.