
ఏబీఏపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరుమల్‌రావు
మంచిర్యాలఅర్బన్: అఖిల భారతీయ అయ్య ప్ప ధర్మప్రచార సభ (ఏబీఏపీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన బేతి తిరుమల్‌రావు ఎన్నికయ్యారు. ఆదివారం తమిళనాడులో తిరువాన్నమాళైలతో ఏబీఏపీ జాతీయ మహాసభ జరిగింది. ఏబీఏపీ గౌరవ అధ్యక్షుడు పీఎన్‌కే మీనన్ శభరిమల మేళ్ళాంతులు పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అయ్యప్పదాస్, ప్రధాన కార్యదర్శిగా తిరుమల్‌రావు రెండోసారి ఎన్నికయ్యారు. ఏబీఏపీ జిల్లా అధ్యక్షుడు రాజుకిరణ్, ప్రధాన కార్యదర్శి సంతోష్ పలువురు హర్షం వ్యక్తం చేశారు.